: జమ్ముకశ్మీర్ లో కొన్నిరోజులు గవర్నర్ పాలన


జమ్ముకశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణించిన నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గవర్నర్ పాలన అమల్లోకి రానుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా సయీద్ కుమార్తె మెహబూబా ముప్తీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ తన తండ్రి సయీద్ కు నాలుగవ రోజు కర్మకాండ (చౌహరం) కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు అంటే ఈ నెల 10 వరకు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని మెహబూబా నిర్ణయించుకున్నారని తెలిసింది. అప్పటివరకు అధికారిక వ్యవహారాల్లో పాల్గొనేందుకు ఆమె సుముఖంగా లేరు. మరోవైపు రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయాలని పలువురు పెద్దలు ఆమెకు సూచించారు. దాంతో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్ వోరా అధికారిక వ్యవహారాలను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News