: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 5న కౌంటింగ్ జరుగుతుంది. దానికిముందు జనవరి 12 నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 18న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 21 గడువు విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డులను రిజర్వేషన్లకు అనుగుణంగా ఖరారు చేసి, విడుదల చేసిన గంటకే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవడం గమనార్హం. ఇక ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ తెలిపారు.