: బీజేపీలో చేరనున్న నాగం జనార్ధన్ రెడ్డి.. ఢిల్లీలో మకాం!


నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరునున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. కొద్దిసేపట్లో ఆయన బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమవనున్నారు. ఇందుకోసం నాగం దేశ రాజధానిలో మకాం వేశారు. దీన్ని బట్టి చూస్తే నాగం బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టంగా సమాచారం అందుతోంది. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు సీటుకు పోటీచేసేందుకు నాగం ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరి పోటీచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగంతో పాటు హస్తినలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News