: జూనియర్, కాంట్రాక్ట్ లెక్చరర్లకు డిప్యూటీ సీఎం కడియం వరాలు
తెలంగాణ జూనియర్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరాలు ప్రకటించారు. ఈ ఏడాది వేసవిలో జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు ఉంటాయని తెలిపారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి అన్ని జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. అలాగే 3,678 మంది కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేసేందుకు ఆలోచన చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం జూనియర్ కాలేజీ లెక్చరర్స్ డైరీ, క్యాలెండర్ లను కడియం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ బోర్డుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా అన్ని సేవలను ఆన్ లైన్ చేస్తున్నామని పేర్కొన్నారు.