: కీలక సమయాల్లో నగరంలో కాలుష్యం తగ్గింది: హైకోర్టుకు తెలిపిన ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సరి-బేసి విధానం వల్ల నగరంలో కాలుష్యం తగ్గిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ముఖ్యంగా కీలక సమయాల్లో కాలుష్యం స్థాయి తగ్గిందని వెల్లడించింది. ఈ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో... వారం రోజుల్లో కాలుష్యం ఏ మేరకు తగ్గిందో నివేదిక ఇవ్వాలని ఇటీవల కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కారు ఇవాళ కోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే, ఈ ట్రయల్ రన్ కు తమకు కేవలం 15 రోజుల సమయం సరిపోదని, అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.