: విశాఖ ఎయిర్ పోర్టు విస్తరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేత
విశాఖపట్టణంలోని విమానాశ్రయం విస్తరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. విమానాశ్రయం విస్తరణ వల్ల రైతులు భూములు కోల్పోతున్నారంటూ ఉప్పాడ శివారెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు, నేడు విచారణ చేపట్టింది. అయితే విమానాశ్రయం విస్తరణకు వ్యతిరేకంగా కాకుండా భూసేకరణలో లోపాలుంటే కోర్టుకు రావాలని పిటిషన్ దారునికి సూచించింది. అనంతరం సదరు పిటిషన్ ను కొట్టివేసింది.