: కన్నీరు పెట్టడం నాకే ఆశ్చర్యం కలిగించింది: ఒబామా


ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా గన్ కల్చర్ కారణంగా చనిపోయిన అమాయక చిన్నారులను గుర్తు చేసుకున్నప్పుడు, తనకు కన్నీరు ఉబికి రావడం తనకే ఆశ్చర్యం కలిగించిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. తానలా కన్నీరు పెట్టుకోవడం చాలా మందికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుందని, అయితే అది సహజంగా భావోద్వేగం కారణంగా జరిగిన సంఘటన అని ఆయన పేర్కొన్నారు. తాను ఇంతకుముందు చెప్పినట్టుగానే చిన్నారుల మరణం తనను నిత్యం వెంటాడుతూనే ఉంటుందన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కనెక్టికట్ లో చిన్నారుల కాల్చివేత ఘటన జరిగిన రోజును ఆయన అత్యంత దుర్దినమైన రోజుగా వర్ణించారు. తన జీవితంలో ఎప్పుడూ తన వద్ద గన్ అనేది లేదని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News