: ముష్కరులకు ఇంటి దొంగల సాయం?...మూడు ఫ్లడ్ లైట్లూ ఆకాశం దిశగానే ఫోకస్!


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులకు గురుదాస్ పూర్ ఎస్పీగా పనిచేసి ఇటీవలే వేరే ప్రాంతానికి బదిలీ అయిన సీనియర్ పోలీసు అధికారి సల్వీందర్ సింగ్ సాయం చేశారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఆయనను పలుమార్లు విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సత్యశోధన పరీక్షను చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉగ్రవాదుల దాడిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు నిన్న రాత్రి ఎయిర్ బేస్ లో పనిచేస్తున్న మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ కు చెందిన ఓ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. సడెన్ గా అతడి అరెస్ట్ కు కారణమేంటంటే... రాత్రివేళల్లోనూ ఉగ్రవాదులు, అల్లరి మూకలు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించేందుకు యత్నిస్తే, సెక్యూరిటీ సిబ్బంది కంటికి ఇట్టే చిక్కేస్తారు. ఇందుకోసం ఎయిర్ బేస్ చుట్టు పక్కల భారీ ఫ్లడ్ లైట్లను అమర్చారు. మొన్న సరిగ్గా ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించే ముందు అక్కడి ప్రాంతంపై నిఘా కోసం ఏర్పాటు చేసిన మూడు ఫ్లడ్ లైట్లూ ఆకాశానికే ఫోకస్ చేశాయి. దీంతో ఉగ్రవాదులు సులువుగానే ఎయిర్ బేస్ లోపలికి చొరబడగలిగారు. ఉగ్రవాదులకు సాయం చేసే క్రమంలోనే సదరు మిలటరీ ఇంజినీర్ ఫ్లడ్ లైట్లను ఆకాశం వైపు ఫోకస్ చేసి ఉంచాడు. దీంతో అక్కడ అలముకున్న చీకట్లలో ఉగ్రవాదులు గుట్టుచప్పుడు కాకుండా ఎయిర్ బేస్ లోకి చేరిపోయారు.

  • Loading...

More Telugu News