: స్క్రిప్టు బాగుంటే పాకిస్థాన్ సినిమా అయినా అభ్యంతరం లేదు: ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ లో పాగా వేసి, హాలీవుడ్ లో పీపుల్స్ ఛాయిస్ అవార్డుతో సత్తా చాటిన ప్రియాంకా చోప్రా తాజాగా పాకిస్థాన్ సినీ ప్రపంచంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటిస్తున్న 'మిస్టర్ చాలూ' సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ పాత్ర పోషించనుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచి స్క్రిప్టుతో వస్తే పాకిస్థానీ సినిమాలో అయినా నటించేందుకు ఇబ్బంది లేదని చెప్పింది. దీంతో భారత్-పాక్ వివాదంపై సినిమా తీస్తే అందులో పాత్ర పోషిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, వివాదంపై భారత్, పాక్ దేశాధినేతలు చూసుకుంటారని, అలాంటి పాత్రలు పోషిస్తే అవి నటులకు భారంగా పరిణమిస్తాయని పేర్కొంది. ప్రియాంక నటించిన 'జై గంగాజల్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.