: నన్ను తొలగించడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా: అమీర్ ఖాన్
'ఇంక్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ గా తనను తొలగించడంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పందించాడు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పాడు. తాను ఉన్నా లేకున్నా భారత్ ఉజ్వలంగా ప్రకాశిస్తుందని అమీర్ ఖాన్ తెలిపాడు. ఏదయినా ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరు ప్రచారకర్తగా ఉండాలి? అనే దానిని నిర్ణయించే పూర్తి అధికారం ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన అమీర్ ఖాన్, ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తెలిపాడు. మత అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా అతనిని ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా తొలగించినట్టు వార్తలు వెలువడినప్పటికీ, గతంలో మెక్ కాన్ వరల్డ్ వైడ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ముగిసిన కారణంగానే అమీర్ ను తొలగించినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ శర్మ వివరించిన సంగతి తెలిసిందే.