: బంతి పాక్ కోర్టులోనే ఉంది: భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్


పఠాన్ కోట్ దాడి విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మాట్లాడారని, ఆ సందర్భంగా ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బంతి పాక్ కోర్టులోనే ఉందని, అది తీసుకోబోయే చర్యల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. పఠాన్ కోట్ దాడిపై చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని భద్రతా బలగాలు అందజేశాయని ఆయన చెప్పారు. పఠాన్ కోట్ దాడితో సరిహద్దుల్లో భదత్ర అంశంపై మరోసారి చర్చ జరుగుతోందని, దీనిపై మరింత దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో భారత వ్యవహారాలను భారత విదేశాంగ శాఖతో అనుసంధానం చేసే ప్రతిపాదనకు ప్రధాని అంగీకరించారని ఆయన తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు సిరియా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News