: ఐఎస్ దారుణం.. చిన్నారి దేహానికి పేలుడుపదార్థాలు కట్టి పేల్చేశారు!


ఐఎస్ఐఎస్ మరో దారుణానికి పాల్పడింది. ఐఎస్ ఉగ్రవాదులు నాలుగేళ్ల చిన్నారి దేహానికి పేలుడు పదార్థాలను కట్టి, వాటిని రిమోట్ ద్వారా పేల్చేసి, భయోత్పాతాన్ని సృష్టించారు. ఇరాక్ లోని అల్-షిర్కత్ జిల్లాలో ఇసాడేర్ అనే బాలుడి శరీరానికి పేలుడు పదార్థాలను ఐఎస్ ఉగ్రవాదులు అమర్చారు. అనంతరం రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చేశారు. కాగా, ఈ సంఘటన జరగడానికి వారం రోజుల ముందు బాలుడి తండ్రిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు. తమకు వ్యతిరేకంగా పోరాడినందుకే అతన్ని హతమార్చామని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News