: ప్రతి దానికి లాబీయింగ్ చేయాల్సి వస్తోంది: కేశినేని నాని
ప్రతి విషయానికి కేంద్రం దగ్గర లాబీయింగ్ చేయాల్సి వస్తోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వెళ్లగక్కారు. విజయవాడలో రైల్వే జీఎంతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు రైల్వే శాఖ చేయాల్సిన ఎన్నో పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. రైల్వేలలో నిధులు లేవంటున్నప్పుడు సమావేశం ఏ ఉద్దేశంతో నిర్వహించారని ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు. మచిలీపట్నం రైల్వే లైన్, ఏపీకి రైల్వే జోన్, వివిధ మార్గాల్లో పెండింగ్ లో ఉన్న ఇతర పనుల గురించి రైల్వే జీఎంను తాము నిలదీసినట్టు ఆయన తెలిపారు.