: రైల్వే అధికారుల సమావేశాన్ని టీడీపీ ఎంపీలు బహిష్కరించలేదు: ఎంపీ రాయపాటి
విజయవాడలో ఇవాళ రైల్వే అధికారులతో జరిగిన సమావేశాన్ని టీడీపీ ఎంపీలు బహిష్కరించలేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. వారి వారి నియోజకవర్గాలకు ఏం కావాలో వినతిపత్రాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. పైరవీలు చేస్తే తప్ప రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రావని రాయపాటి మండిపడ్డారు. రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజధాని ప్రాంతం గుంటూరు, బెజవాడలోనే రైల్వే జోన్లు ఏర్పాటు చేయాలని, వరదలు, తుపాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖలో రైల్వే జోన్ ఎందుకని ఎంపీ ప్రశ్నించారు. మరోవైపు రైల్వే జీఎం రవీంద్రగుప్తా కూడా ఈ సమావేశంపై స్పందించారు. వారి వారి నియోజకవర్గాల్లోని సమస్యలపై కొంతమంది ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. అన్ని అంశాలు తన పరిధిలో ఉండవని, తన పరిధిలో ఉన్న వాటిపై మాత్రమే చర్యలు తీసుకోగలనని చెప్పారు. కాగా ఎంపీల ప్రతిపాదనలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళతానని చెప్పారు.