: సిట్ బృందం నన్ను మూడు గంటలపాటు విచారించింది: మల్లాది విష్ణు


విజయవాడ కల్తీ మద్యం కేసులో ఏర్పాటైన సిట్ బృందం తనను మూడు గంటల పాటు విచారించిందని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు తెలిపారు. రెండో రోజు విచారణ అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడారు. స్వర్ణ బార్ లో విష ప్రయోగం జరిగిందని అనుమానిస్తున్నామని అధికారులు తనతో విచారణలో అన్నారని చెప్పారు. అయితే అందుకు గల కారకులెవరో తేల్చాలని సిట్ కు చెప్పానని తెలిపారు. కారకులు ఎవరో తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సిట్ చెప్పిందని విష్ణు వివరించారు.

  • Loading...

More Telugu News