: ములుగులో ఉద్యాన వర్సిటీకి శంకుస్థాపన


మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్, అటవీ కళాశాల భవనాలకు సీఎం కేసీఆర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఉద్యాన వర్సిటీ ఏర్పాటుతో ములుగుకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించనుంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వర్సిటీ, కళాశాల ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు వర్సిటీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News