: జమ్ముకశ్మీర్ లో వారంపాటు సంతాపదినాలు... ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు
జమ్ముకశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతికి నివాళిగా ఆ రాష్ట్రంలో వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ ఏడు రోజుల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాష్ట్ర జెండాలను అవనతం చేశారు. సీఎం మృతికి సంతాపంగా ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ముప్తీ పార్ధివ దేహానికి ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ వెళ్లనున్నారు.