: ఐదుసార్లు టీ తాగే కూలీలకు కిలో రూపాయి బియ్యం ఇవ్వక్కర్లేదు...'జేసీ' విశ్లేషణ!
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా రూపాయికే కిలో బియ్యం పథకంపై ఘాటైన విమర్శలు చేశారు. తాను సంక్షేమ పథకాలకు వ్యతిరేకినని, ప్రతిరోజూ కూలిపనికి వెళ్లేవారు రోజులో ఐదు సార్లు టీ తాగుతుంటారని, అలాంటి వారికి కిలో రూపాయి బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, అది పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తనకు లక్ లేకనే మంత్రిని కాలేకపోయానని, చంద్రబాబుకు లక్ ఉండటంతోనే తిరిగి సీఎం అయ్యారని అన్నారు.