: పండక్కి వంటల పోటీలు పెట్టండి... అధికారులకు బాబు సూచన


సంక్రాంతి అనగానే పిండివంటలు, ముగ్గులు గుర్తుకువస్తాయి. అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండక్కి గ్రామాల్లో వంటల పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురువారం కర్నూలు నుంచి టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడిన ఆయన, సంక్రాంతి సందర్భంగా గ్రామాలను దత్తత తీసుకున్న వారిని సన్మానించడంతో పాటు, అత్యంత వేడుకగా గ్రామీణ తెలుగింటి ఆడపడుచుల కోసం వంటల పోటీలను నిర్వహించాలని సూచించారు.

  • Loading...

More Telugu News