: 'అడవిరాముడు' ఆయనకు... 'అడవిదొంగ' నాకు: చిరంజీవి
‘అడవిరాముడు ఆయనకు.. అడవిదొంగ నాకు ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు నటించిన చిత్రాలు 12.. ఆయన దర్శకత్వంలోనే తాను నటించిన చిత్రాలు కూడా 12 అని చెప్పారు. విభిన్న పాత్రలు పోషించిన మహానటుడు ఎన్టీఆర్ ను ‘మాస్’ కు దగ్గర చేసిన చిత్రం అడవిరాముడేనని అన్నారు. తనను మాస్ హీరోగా నిలబెట్టింది రాఘవేంద్రరావు చిత్రాలేనన్నారు. పరిశ్రమలో తనకు తిరుగులేదు అనుకున్నానంటే ఆయనతో చేసిన చిత్రాల చలువేనన్నారు.