: 'ఇంక్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ఖాన్ ను తొలగించిన కేంద్రం
'ఇంక్రెడిబుల్ ఇండియా' అంటూ ప్రచారం చేసిన అమీర్ ఖాన్ ఇకపై ఆ హోదాను పోగొట్టుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడైన అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలు ఆయన ఈ హోదా పోగొట్టుకునేందుకు కారణమయ్యాయి. దేశ ప్రజల్లో సమైక్యతా భావం పెంపొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంక్రెడిబుల్ ఇండియా ద్వారా పలు వాణిజ్య ప్రచార కార్యక్రమాలు రూపొందించింది. సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అమీర్ ఖాన్, మత అసహనంపై చేసిన వ్యాఖ్యల కారణంగా అప్రదిష్ఠ మూటగట్టుకున్నాడు. ఆనాటి వ్యాఖ్యల కారణంగా అమీర్ ఖాన్ బ్రాండ్ వేల్యూ కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది.