: ఈ ఏడాది చివరి నాటికి రామమందిర నిర్మాణం పూర్తవుతుంది: సుబ్రహ్మణ్యస్వామి


ఈ ఏడాది చివరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతుందని బీజేపీ నేత సుబ్రహ్యణ్యస్వామి పేర్కొన్నారు. ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యేలా ఈ నెల 9న జరిగే జాతీయస్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సుబ్రహ్మణ్యస్వామి సమాధానమిస్తూ, రాముడికి, రాజకీయాలకు సంబంధం లేదని, నిర్మాణం ప్రతిహిందువు ఆకాంక్ష అని అన్నారు. మందిర నిర్మాణాన్ని ఎన్నికలతో ముడిపెట్టవద్దని ఆయన అన్నారు. ప్రస్తుతం మందిర నిర్మాణానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని .. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే మందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News