: పండగ రద్దీ... హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 2,470 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను పలు మార్గాల్లో తిప్పుతామన్నారు. ఈ నెల 8 నుంచి 14 వరకు ఈ బస్సులను నడుపుతామని, 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ ఈడీ నాగరాజు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని పేర్కొన్నారు. www.tsrtconline.com అనే వెబ్ సైట్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు. బస్సుల సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ల వివరాలను నాగరాజు పేర్కొన్నారు. ఎంజీబీఎస్ - 040 24614406, 23434268 జేబీఎస్ - 040 27802203, 2465 6430