: ‘ఐయామ్ నాట్ ఏ హీరో’ అంటున్న ఫ్రెంచ్ ధీశాలి!
‘నాకు చాలా ఇష్టమైన ఫ్రెంచ్ వ్యక్తి ఇతనే’ అంటూ లసన బతిలిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హోలండ్ నాడు ప్రశంసించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే, గత ఏడాది జనవరిలో పారిస్ లోని జ్యూయిష్ సూపర్ మార్కెట్ పై జీహాది దాడి జరగింది. ఆ సమయంలో లసన అక్కడే ఉన్నాడు. లసన ముస్లిం వ్యక్తే అయినప్పటికీ జ్యూయిష్ ప్రజలను కాపాడాడు. అక్కడి నుంచి తాను తప్పుకోవడమే కాకుండా వారిని కూడా తప్పించాడు. దీంతో ఫ్రెంచ్ పత్రికలు అతన్ని హీరోను చేస్తూ వార్తలు రాశాయి. ఇదంతా లసనకు గుర్తుంది. ఈ నేపథ్యంలో అతనొక పుస్తకం రాశాడు. దాని పేరు ‘ఐయామ్ నాట్ ఏ హీరో’. సూపర్ మార్కెట్ లో దాడి జరిగిన సమయంలో తాను చేయాల్సిందే చేశానని, తానేమీ హీరోను కాదని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.