: మూడు హెచ్ఎంటీ కంపెనీల మూసివేతకు గ్రీన్ సిగ్నల్
హెచ్ఎంటీ వాచెస్, చినార్ వాచెస్, బేరింగ్ కంపెనీలను మూసివేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మూడు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్), వాలంటరీ సపరేషన్ స్కీమ్ (వీఎస్ఎస్) కింద వారికి చెల్లింపులు జరుపుతామని, చెల్లింపుల నిమిత్తం సుమారు రూ.427.48 కోట్లు వెచ్చించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. వీఆర్ఎస్ ఉద్యోగులకు 2007 పే స్కేల్ ప్రకారం చెల్లింపులు ఉంటాయని.. ఈ మూడు హెచ్ఎంటీ కంపెనీల ఆస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయిస్తామని సీసీఈఏ తెలిపింది.