: మోదీజీ ఏం మారింది?: నిప్పులు చెరిగిన శివసేన


ఎన్డీయే మిత్ర పక్షం శివసేన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. పఠాన్ కోట్ దాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్న శివసేన, ఎన్నికలకు ముందు చెప్పిన మార్పు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో ఆశలతో భారీ విజయం కట్టబెట్టిన ప్రజలు దేశం మారిపోతుందేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని శివసేన పేర్కొంది. రామ మందిర నిర్మాణం నుంచి యూనిఫాం సివిల్ కోడ్ వరకు, ద్రవ్యోల్బణం నుంచి అవినీతి వరకు, హిందూత్వ విధానం నుంచి పాకిస్థాన్ పాలసీ వరకు, బీజేపీ దేనిని మార్చిందని ఆ పార్టీ నిలదీసింది. పఠాన్ కోట్ దాడి, రామ మందిర నిర్మాణం ఇలా ఏ అంశంలోనూ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తేడాలేదని శివసేన స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులనే బీజేపీ కూడా చేస్తోందని ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. కార్గిల్ యుద్ధం, ముంబై దాడుల అనంతరం ప్రశ్నించినట్టే పఠాన్ కోట్ దాడి అనంతరం కూడా ప్రశ్నిస్తున్నామని శివసేన స్పష్టం చేసింది. మార్పు తెస్తామని పేర్కొన్న కేంద్రం ఏం మార్చిందో అవలోకించుకోవాలని సామ్నా సూచించింది.

  • Loading...

More Telugu News