: హైదరాబాదుకూ పాకిన వివాదాస్పద ఫ్లెక్సీ సంస్కృతి!


రాజకీయనాయకుల బొమ్మలకు సినిమా హీరోల ఫోటోలను తగిలించి రూపొందించే ఫ్లెక్సీ సంస్కృతి ఇప్పుడు హైదరాబాదుకూ పాకింది. హనుమాన్ శోభాయాత్ర జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులో రాజకీయనేతలు, హీరోలతో కలిపి పెట్టిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదమవుతోంది. ఇందులో ఓవైపు సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్.. మరోవైపు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ పోటోలతో కలిపి ఈ ఫ్లెక్సీని రూపొందించారు.

సికింద్రాబాదుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పల్లా వెంకటరెడ్డి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. దీన్ని చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఈ ఫ్లెక్సీ విషయమే హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఖమ్మంలో మహేష్ బాబు ఫోటోతో వైఎస్ఆర్ పార్టీ ఇలానే ఓ ఫ్లెక్సీ పెట్టింది. ఆమధ్య విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వైఎస్ఆర్ పార్టీకి చెందిన కొంతమంది అభిమానులు ఇలానే పెట్టారు. చివరికి అది నందమూరి కుటుంబంలో కొంతమేర కలహాలకు దారి తీసింది.

  • Loading...

More Telugu News