: అన్నంలో పురుగులున్నాయని కంచాలతో రోడ్డెక్కిన అనంత విద్యార్థులు


తమకు పెడుతున్న అన్నంలో పురుగులు వచ్చాయని ఆరోపిస్తూ, అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఈ ఉదయం రహదారిపై నిరసన తెలిపారు. ఇదే విషయమై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. అన్నం తిన్న తమకు వాంతులు వస్తున్నాయని చెబుతూ, కంచాల్లో హాస్టల్ అన్నాన్ని తెచ్చి స్థానిక క్లాక్ టవర్ జంక్షన్ లో రోడ్డుపై ధర్నా చేశారు. కలెక్టరుకు విషయం తెలిసినా ఊరుకుంటున్నారని విద్యార్థులు విమర్శించారు. పేదరికంలో మగ్గుతూ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి చదువుకుంటుంటే, హాస్టళ్లలో పెడుతున్న భోజనం అత్యంత నాసిరకంగా ఉండటం, తమకు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యాన్ని కలిగిస్తోందని, అధికారులు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్, వైకాపా, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News