: విజయవాడ టు కర్నూలు వయా కడప... చంద్రబాబు జన్మభూమి మార్గం!
కర్నూలు జిల్లాలో నేడు జరగనున్న జన్మభూమి సభలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బయలుదేరి వెళ్లారు. విజయవాడ నుంచి కడప వరకూ ప్రత్యేక విమానంలో వెళ్లిన ఆయన, అక్కడి నుంచి హెలికాప్టర్ లో కొద్దిసేపటి క్రితం కర్నూలుకు బయలుదేరారు. కడప విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగుదేశం నేతలు, పార్టీ కార్యకర్తలతో బాబు కాసేపు ముచ్చటించారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం తరువాత కర్నూలు జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, ఆపై జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.