: రైతులు అంగీకరిస్తేనే గ్రామాల మధ్యలో రోడ్లు వేస్తాం: మంత్రి నారాయణ
అమరావతి సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో ఆరు గ్రామాల మధ్యలో నుంచి రోడ్ల నిర్మాణంపై మంత్రి నారాయణ ఇవాళ స్పష్టత ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ లో సమాంతర రోడ్లకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. అయితే ఆరు గ్రామాల్లో 3 కిలోమీటర్ల రోడ్లపైనే అభ్యంతరాలు వచ్చాయని, రైతులు ఒప్పుకుంటేనే గ్రామాల మధ్య నుంచి రోడ్లు వేస్తామని చెప్పారు. లేకుంటే రోడ్లను పక్కకు మళ్లిస్తామని పేర్కొన్నారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో రాజధాని మాస్టర్ ప్లాన్ పై ఇవాళ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతీలాల్ దండే, జేసీ శ్రీధర్, ఇతర అధికారులు, 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. జరీబు భూముల రైతులకు జరీబు భూముల్లోనే ప్లాట్లు, మెట్ట ప్రాంతం వారికి మెట్ట ప్రాంతంలోనే ప్లాట్లు ఇస్తామని నారాయణ వివరించారు.