: మరో వారంలో క్రికెట్ పండుగ... 12 నుంచి టీమిండియా, ఆసీస్ సిరీస్


ఇంకో వారం రోజులుంటే, క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ. ఆస్ట్రేలియాలో పర్యటనకు నిన్న టీమిండియా కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో బయలుదేరిన సంగతి తెలిసిందే. ఆసీస్ టూర్ లో టీమిండియా ఆ దేశ జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పొట్టి క్రికెట్ సిరీస్ అభిమానులను టీవీ తెరలకు అతుక్కుపోయేలా చేయనుంది. ఆసీస్ పర్యటనకు బయలుదేరిన టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ కూల్ ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించనుండగా, టెస్టు జట్టు కెప్టెన్ రెండు ఫార్మాట్లలోనూ స్టార్ బ్యాట్స్ మన్ గా బరిలోకి దిగుతున్నాడు. సిరీస్ షెడ్యూల్, వేదికలు, జట్ల వివరాల విషయానికొస్తే... తొలి వన్డే... జనవరి 12... వాకా గ్రౌండ్, పెర్త్ రెండో వన్డే... జనవరి 15... గబ్బా స్టేడియం, బ్రిస్బేన్ మూడో వన్డే... జనవరి 17... మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్ బోర్న్ నాలుగో వన్డే... జనవరి 20... మనూకా ఓవల్, కాన్ బెర్రా ఐదో వన్డే... జనవరి 23... సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ తొలి టీ20... జనవరి 26... ఆడిలైడ్ ఓవల్, ఆడిలైడ్ రెండో టీ20... జనవరి 29... మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్ బోర్న్ మూడో టీ20... జనవరి 31... సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ టీమిండియా వన్డే జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, రిషి ధావన్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అజింక్యా రెహానే, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, గురుకీరత్ సింగ్, బ్రైందర్ శరన్, ఉమేశ్ యాదవ్ టీమిండియా టీ20 జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా, అజింక్యా రెహానే, మొహ్మద్ షమీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఉమేశ్ యాదవ్ ఆస్ట్రేలియా వన్డే జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, జార్జి బెయిలీ, స్కాట్ బొలాండ్, జోష్ హాజిల్ వుడ్, జేమ్స్ ఫాల్కనర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, జోయెల్ పారిస్, మాథ్యూ వేడ్ ఆసీస్ టీ20 జట్టును ఇంకా ప్రకటించలేదు. వన్డే సిరీస్ ముగియగానే తుది జట్టు ఖరారు కానుంది.

  • Loading...

More Telugu News