: సంజయ్ దత్ శిక్షా కాలం తగ్గింపు... రిలీజ్ డేట్ ఖరారు!


ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమంగా ఆయుధాలను కలిగివున్న ఆరోపణలపై నేరం రుజువై జైలు శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శిక్షాకాలాన్ని తగ్గిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. జైల్లో ఆయన సత్ప్రవర్తన కారణంగా శిక్షను తగ్గిస్తున్నామని తెలిపింది. దీంతో ఆయన ఫిబ్రవరి 27వ తేదీన పుణె ఎరవాడ జైలు నుంచి విడుదల కానున్నారు. తన శిక్షాకాలంలో పలుమార్లు పెరోల్ మీద సంజయ్ దత్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పదేపదే సంజయ్ కి పెరోల్ ఇస్తుండటంపై గతంలో ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News