: రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రవణ్ కు గాయాలు


బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం నదీమ్- శ్రవణ్ జోడీలోని శ్రవణ్ ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీ జైపూర్ హైవేపై కారులో వెళుతుండగా ఆయన వాహనం ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలైన శ్రవణ్ ను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 1979లో విడుదలైన 'దంగల్' సినిమాతో నదీమ్- శ్రవణ్ జోడీ సంగీత ప్రయాణం మొదలు పెట్టింది. అలా 2005 వరకు బాలీవుడ్ లో ఎన్నో అద్భుత చిత్రాలకు సంగీతం అందించారు. తరువాత ఇద్దరు విడిపోయి సంగీత దర్శకత్వం చేసినప్పటికీ అంతగా విజయాలను నమోదు చేయలేకపోయారు.

  • Loading...

More Telugu News