: విద్యార్థుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఎయిర్ ఇండియాపై అమెరికన్ వర్శిటీ దావా!


తమ యూనివర్శిటీపై తప్పుడు ప్రచారం చేస్తూ, విద్యార్థుల్లో ఆందోళన పెంచుతున్నారని ఆరోపిస్తూ, కాలిఫోర్నియాకు చెందిన నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ (ఎన్పీయూ) ఎయిర్ ఇండియాపై దావా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వర్శిటీ అధ్యక్షుడు పీటర్ హీష్ స్వయంగా వెల్లడించారు. "మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాపై పరువు నష్టం దావా వేస్తున్నాం. ఎన్పీయూ ఖ్యాతిని మంటగలిపేలా ఆ సంస్థ వ్యాఖ్యలున్నాయి" అని ఆయన విమర్శించారు. అయితే, ఎయిర్ ఇండియా ఎప్పుడు, ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశాయన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇక కేసును అమెరికాలో వేస్తారా? లేదా ఇండియాలో వేస్తారా? అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఈ యూనివర్శిటీలో చేరేందుకు వెళ్లాలని, వీసాలు తీసుకుని అమెరికా చేరిన ఎందరో భారత విద్యార్థులను అక్కడి అధికారులు తిప్పి పంపిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News