: భారత్ లో ఏటా 50 వేల మంది ప్రాణాలు తీస్తున్న పాములు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విష సర్పాలలో 10 శాతం పాములు భారత్ లోనే ఉన్నాయని, అవి ఏటా 50 వేల మంది ప్రాణాలను బలిగొంటున్నాయని సైన్స్ కాంగ్రెస్ వెల్లడించింది. పాముకాటు వలన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందినవారు అధికంగా చనిపోతున్నారని తెలిపింది. దీనికి రాత్రి వేళల్లో విద్యుత్ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రపంచంలో మొత్తం 275 రకాల పాములుండగా, వీటిలో 62 రకాలు విష సర్పాలని తెలిపింది. వీటిలో 42 రకాల సర్పాలు అత్యంత ప్రమాదకరమని, విషంలేని పాములు 171 రకాలున్నాయని సైన్స్ కాంగ్రెస్ తెలిపింది. కాగా పాము కాటువలన చనిపోతున్న వారిలో 14 ఏళ్ల లోపువారే అధికంగా ఉంటున్నారని, సరైన వైద్య చికిత్స అందకపోవడం వలనే వారంతా చనిపోతున్నారని తేలింది.