: జర్మనీలో 90 మంది మహిళలపై వేధింపులు... ఆలస్యంగా వెలుగులోకి!
జర్మనీలో ఇటీవల జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పలువురు మహిళలపై లైంగిక వేధింపులు జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జర్మన్ లోని కోలోన్ పట్టణంలో సుమారు 90మంది మహిళలు తమపై జరిగిన వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త సంవత్సరం ఆరంభ వేళ కోలోన్ రైల్వే స్టేషన్ వద్ద పలువురు పురుషులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ వారు ఆరోపించారు. పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం వెల్లడైనట్టు తెలుస్తోంది. వీరంతా అరబ్, ఉత్తర ఆప్రికాకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.