: హిమాలయ ప్రాంతంలో భయంకర భూకంపం రానుంది... అప్రమత్తమంటూ హోంశాఖ హెచ్చరిక


త్వరలో భయంకర భూకంపం రానుందని హోంశాఖ హెచ్చరించింది. దీని తీవ్రత 8.2 లేదా అంతకుమించి కూడా ఉండవచ్చని సంబంధిత విశ్లేషకులు తెలియజేశారని వివరించింది. ఈ భూకంపం హిమాలయ పర్వత సమీపంలో రానుందని, సోమవారం మణిపూర్ లో వచ్చిన భూకంపం కన్నా ఇది తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని తెలియజేసింది. కాగా ఇంతకుముందు, నేపాల్ లో 7.3 (మే 2015), సిక్కింలో 2011లో 6.9 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. భూఅంతర్భాగంలో ఇటీవల చోటుచేసుకున్న మార్పుల కారణంగానే ఇలా భూకంపాలు వస్తున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. అయితే త్వరలో సంభవించబోయే భూకంపం ముఖ్యంగా ఉత్తర భారతదేశం, అదీ పర్వత ప్రాంతాల్లో చోటుచేసుకునే అవకాశముందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News