: అధికారుల తీరుపై మండిపడ్డ కేసీఆర్!


వరంగల్ జిల్లా అభివృద్ధిపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించిన సమాచారాన్ని అధికారులను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామీణ నీటిపారుదల శాఖాధికారులు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖాధికారుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దంటూ వారిని హెచ్చరించారు. అనంతరం, మేడారం జాతర.కామ్ అనే వెబ్ సైట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ఆవిష్కరించారు. మేడారం జాతర విశిష్టతను, ప్రాధాన్యతను ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

  • Loading...

More Telugu News