: మరో సచిన్ వచ్చేశాడు: హర్భజన్


భారత క్రికెట్ లోకి మరో సచిన్ వచ్చేశాడని టీమిండియా ఆటగాడు హర్భజన్ సింగ్ అన్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లెవెల్ టోర్నమెంట్ లో కేసీ గాంధీ స్కూల్ తరపున బరిలోకి దిగి ఆర్యా గురుకుల్ పాఠశాల జట్టుపై 1009 పరుగులు చేసిన ప్రణవ్ ధనవాడేను క్రికెట్ ప్రపంచం ప్రస్తుతిస్తోంది. ప్రణవ్ ఏ స్థాయి క్రికెట్ లో ఈ ఘనత సాధించాడన్నది చూడాల్సిన పని లేదని, ఏ స్థాయిలో అయినా ఓ ఆటగాడు చూపే ప్రదర్శనే అత్యుత్తమమని భజ్జీ పేర్కొన్నాడు. ప్రణవ్ ధనవాడే ప్రదర్శనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. తన రాష్ట్రానికి చెందిన ప్రణవ్ ను చూస్తే గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రదర్శన చేశాడని ఆయన అభినందించారు.

  • Loading...

More Telugu News