: ‘జీహాది’ జూనియర్ కూడా తయారయ్యాడు!


ఐఎస్ఐఎస్ తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో తలకు హెడ్ స్కార్ఫ్ ధరించిన ఒక బాలుడు దర్శన మిస్తాడు. ఈ వీడియోలో కనిపించే బాలుడు గ్రేస్ డేర్ అనే మహిళా ఉగ్రవాది కొడుకేనని బ్రిటన్ లోని ఒక ప్రముఖ పత్రిక పేర్కొంది. గ్రేస్ కుమారుడు ఈసాతో స్పష్టమైన పోలికలు ఉన్న ఈ బాలుడిని ‘జీహాదీ జూనియర్’ అంటూ బ్రిటన్ మీడియా పేర్కొంటోంది. సుమారు పదినిమిషాల పాటు ప్రసారమయ్యే ఈ వీడియోలో ‘జీహాదీ జూనియర్’ తన ఎడమచేతితో సుదూర ప్రాంతాన్ని చూపిస్తున్న ఆ చిన్నారి తలకు ఉన్న స్కార్ఫ్ పై ఐఎస్ లోగో ఉంది. కాగా, గ్రేస్ డేర్ అనే మహిళకు బ్రిటన్ లో నివసిస్తున్న నైజీరియా క్రైస్తవ కుటుంబం ఆశ్రయం కల్పించింది. గ్రేస్ ఉగ్రవాదానికి ఆకర్షితురాలవడం, ఆపై ఐఎస్ లో చేరడం తెలిసిందే. 2012లో సిరియాకు వెళ్లి ఐఎస్ కు చెందిన అబు బకర్ ను గ్రేస్ వివాహం చేసుకుంది.

  • Loading...

More Telugu News