: చైనాలో మావో జెడాంగ్ భారీ విగ్రహం ఏర్పాటు


చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ భారీ విగ్రహాన్ని ఆ దేశంలోని ఓ గ్రామంలో ఏర్పాటుచేశారు. దాదాపు 36 మీటర్లు ఉన్న ఆ విగ్రహ నిర్మాణానికి మూడు కోట్లకు పైగానే ఖర్చు అయింది. ఈ విగ్రహాన్ని స్టీల్, కాంక్రీట్ లతో నిర్మించి బంగారం రంగు వేశారు. ఈ గోల్డెన్ విగ్రహాన్ని హెనన్ ప్రావిన్స్ లోని కైఫెంగ్ సమీపంలో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన ఆయన విగ్రహాన్ని స్థాపించేందుకు గ్రామస్తులు కూడా విరాళాలు సేకరించగా, పేద కళాకారులు విగ్రహాన్ని తయారు చేశారు. 1893, డిసెంబర్ 26న జన్మించిన మావో సెప్టెంబర్ 9, 1976లో కన్నుమూశారు. 40 సంవత్సరాల తరువాత మావోకు భారీ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఇటీవలే మావో జెడాంగ్ రాసిన ఓ లేఖ వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News