: ఐపీఎల్ లో నేటి సందడి


ఐపీఎల్ ఆరవ సీజన్ లో భాగంగా నేడు 'చెన్నై సూపర్ కింగ్స్-హైదరాబాద్ సన్ రైజర్స్' జట్లు తలపడబోతున్నాయి. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంటే చెన్నై ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే రైజర్స్ జట్టు 'నెట్ రన్ రేట్' తో ద్వితీయ స్థానంలో నిలుస్తుంది. అదే కింగ్స్ జట్టు గెలిస్తే మొదటిస్థానంలోకి వెళ్తుంది. ఇదిలావుంచితే, నిన్నరాత్రి డిపెండింగ్ ఛాంపియన్ 'కోల్ కతా నైట్ రైడర్స్ -ముంబయి ఇండియన్స్' మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా మూడోసారి ఓటమిని చవి చూసింది. 62 పరుగులతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచిన డ్వేన్ స్మిత్ ముంబయిని విజయతీరం చేర్చాడు. 5 వికెట్ల నష్టానికి ముంబయి 162 పరుగులు చేయగా, కోల్ కత 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది.

  • Loading...

More Telugu News