: కోడి పందాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఎల్లుండికి వాయిదా
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే కోడి పందాలపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పీపుల్స్ ఫర్ ఏనిమల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. కోడి పందాలు చారిత్రక సంప్రదాయమని, వాటిని కొనసాగించాలని బీజేపీ నేత రామకృష్ణంరాజు వాదించారు. మరోవైపు కోడి పందాలను జీవహింసగా పేర్కొంటూ పీపుల్స్ ఫర్ ఏనిమల్స్ సంస్థ తమ వాదనలు వినిపించింది. వాటిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.