: ఒంటికి పేలుడు పదార్థాలు అమర్చుకున్నారు: మనోహర్ పారికర్


పఠాన్ కోట్ ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులతో పోరాడుతూ ఆరుగురు సైనికులు వీర మరణం పొందారని అన్నారు. ఉగ్రవాదులు తమ ఒంటికి పేలుడు పదార్థాలు అమర్చుకున్నారని, వారిని ముట్టుకుంటే అవి పేలిపోయేలా ప్రణాళికలు రచించుకున్నారని, ఉగ్రవాదులు వదిలిన, అమర్చుకున్న పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇలా గ్రెనేడ్ లను నిర్వీర్యం చేస్తూ ఒక సైనికుడు అసువులుబాసాడని ఆయన చెప్పారు. దీంతో తీవ్రవాదుల నుంచి లభించిన ఆయుధ సామగ్రిని సేకరించాల్సిన అవసరం లేదని, నిర్వీర్యం చేయడానికి బదులు వాటిని అలాగే పేల్చేయాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. దాడి ఘటనపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. తీవ్రవాదులకు డీఎన్ఏ టెస్టులు ముగిశాయని ఆయన వివరించారు. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News