: ఇరాన్ తో వైమానిక సంబంధాన్ని తెంచుకుంటున్నామని సౌదీ ప్రకటన
సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న సౌదీ తాజాగా ఆ దేశంతో తమ వైమానిక సంబంధాన్ని తెంపుకుంటున్నట్టు ప్రకటించింది. ఇక ఇరాన్ కు తమ దేశం నుంచి విమానాలు వెళ్లవని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలన్నింటినీ తెగదెంపులు చేసుకుంటున్నామని తెలిపింది. ఒకవేళ తమతో దౌత్య సంబంధాలు పెంపొందించుకోవాలనుకుంటే ముందు ఇరాన్ ఓ సాధారణ దేశంలా వ్యవహరించడం నేర్చుకోవాలని సౌదీ హితవు పలికింది. సున్నీ ప్రాబల్య దేశమైన సౌదీ... షియా మత గురువు నిమ్ర్ అల్ నిమ్ర్ ను ఉరితీయడాన్ని షియా మెజారిటీ దేశమైన ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో రెండు దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.