: భారీ వసూళ్ల 'బాజీరావ్ మస్తానీ'
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'బాజీరావ్ మస్తానీ' చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అందులో దేశ వ్యాప్తంగా రూ.211 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ లో రూ.90 కోట్ల మార్కును చేరినట్టు వెల్లడించింది. మరాఠా యోధుడు పీష్వా బాజీరావ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ భారీ చిత్రంలో నటులు రణ్ వీర్ సింగ్, దీపికాపదుకొణె, ప్రియాంకచోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబరు 18న ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.