: చెన్నైలో నెల్లూరు పోలీసుల ‘ఎర్ర’ వేట... అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ అరెస్ట్


ఎర్ర చందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓ స్మగ్లర్ కోసం నెల్లూరు జిల్లా పోలీసులు తమిళనాడు రాజధాని చెన్నైలో రోజుల తరబడి సాగించిన వేట ఎట్టకేలకు ఫలించింది. ఇంటర్నేషనల్ రెడ్ శాండర్స్ స్మగ్లర్ ఖలీల్ రెహ్మాన్ అలియాస్ భాయ్ నెల్లూరు జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా అతడి వద్ద ఉన్న రూ.1.75 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఎర్రచందనం వృక్షాలను కోసేందుకు వాడే సామగ్రిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News