: అపోలో హాస్పిటల్స్ పై ఐటీ దాడులు... ఆసుపత్రులు సహా చైర్మన్ ఇంటిలోనూ సోదాలు


నేటి ఉదయం దేశీయ వైద్య రంగ వర్గాలే కాక వాణిజ్య వర్గాలు కూడా షాక్ కు గురయ్యాయి. దేశీయంగానే కాక అంతర్జాతీయంగా వైద్య రంగంలో ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరుగాంచిన అపోలో హాస్పిటల్స్ పై నేటి ఉదయం ఆదాయపన్ను శాఖ ఆకస్మికంగా దాడులు చేసింది. తమిళనాడు రాజధాని చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అపోలో హాస్పిటల్స్ కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలతో పాటు చెన్నైలోని సంస్థ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఈ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాడులకు గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News