: ‘చిన్నారి పెళ్లికూతురు’పై ‘నకిలీ’ ఖాకీల వేధింపులు


బుల్లి తెర ప్రముఖ నటి, ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం ప్రత్యూష బెనర్జీ ఇటీవల తన సొంతింట్లోనే తీవ్ర భయాందోళనలకు గురైంది. ముంబైలోని కాందివ్లీలోని తన ఇంటిలోకి ప్రవేశించిన కొందరు దుండగులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారట. ఈ మేరకు ఆమె కాందివ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులు తమను తాము పోలీసులుగా చెప్పుకున్నారని, వాస్తవానికి వారు పోలీసులు కాదని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఆ బుల్లి తెర నటి అంగీకరించలేదు.

  • Loading...

More Telugu News