: 199 బంతుల్లో 78 ఫోర్లు, 30 సిక్సులతో 652 పరుగులు... రికార్డులన్నీ బద్దలు!


ప్రపంచ స్కూల్ క్రికెట్ చరిత్రలో పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న హెచ్టీ భండారీ ఇంటర్ స్కూల్ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా, కేసీ గాంధీ స్కూల్ జట్టు, ఆర్యా గురుకుల్ స్కూల్ తో పోటీ పడగా, గాంధీ స్కూల్ ఆటగాడు ప్రణవ్ ధనవాడే ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. మొత్తం 199 బంతులను ఎదుర్కొన్న ప్రణవ్, 78 ఫోర్లు, 30 సిక్సులతో చెలరేగిపోయి 652 పరుగులు చేశాడు. 1899లో ఆర్థర్ కోలిన్స్ 628 పరుగులు చేయగా, ఆపై దాన్ని బీట్ చేసింది ప్రణవ్ మాత్రమే. కాగా, ఇండియాకు సంబంధించినంత వరకూ 2013లో పృధ్వీ షా చేసిన 546 పరుగులే రికార్డు కాగా, ఇప్పుడు ఆ రికార్డుతో పాటు ప్రపంచ స్కూల్ క్రికెట్ రికార్డులన్నీ కాలగతిలో కలిసిపోయాయి. 1988లో హారిస్ షీల్డ్ టోర్నమెంటులో భాగంగా వినోద్ కాంబ్లీ (349), సచిన్ టెండూల్కర్ (326) పరుగులతో ఆకట్టుకోగా, వారిద్దరి ఆటనూ కలిపి ఇప్పుడు ప్రణవ్ చూపాడని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News